Bike Stunts: పబ్లిక్ ప్లేస్‌లో బైక్‌లపై స్టంట్స్ చేస్తూ యువకుల హల్‌చల్
Bike Stunts: ట్రిపుల్ రైడింగ్ చేస్తూ ప్రమాదకర విన్యాసాలు
Bike Stunts: పబ్లిక్ ప్లేస్‌లో బైక్‌లపై స్టంట్స్ చేస్తూ యువకుల హల్‌చల్
Bike Stunts: రోడ్డు పై వెళ్లేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి ప్రమాదం ముంచుకొస్తుందో ఊహించలేం కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. రోడ్డు ప్రమాదం జరిగితే ఆ కుటుంబం అంతా రోడ్డున పడాల్సి వస్తుందన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ విజయవాడలో కొందరు యువకులు బైక్ స్టంట్స్‌తో రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియాలో లైకుల కోసం ప్రమాదకర విన్యాసాలు చేస్తూ బైకులతో స్టంట్ లు చేస్తున్నారు.
స్టంట్ లు చేస్తున్న వీడియోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు. పబ్లిక్ గా బందర్ రోడ్డు ఏలూరు రోడ్డు దుర్గ గుడి ఫ్లైఓవర్ కింద యువకులు స్టంట్ లకు పాల్పడుతున్నారు.ఇటీవలే బైక్ పై స్టంట్స్ చేసిన యువతికి కౌన్సిలింగ్ చేసి పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ విజయవాడలో యువకుల తీరుమాత్రం మారడం లేదు. త్రిభుల్ రైడింగ్ చేస్తు నగరంలో విన్యాసాలకు పాల్పడుతున్నారు.