Badvel Bypoll: బద్వేల్ లో వైసీపీ విజయం ఖాయం- దాసరి సుధ

Badvel Bypoll: బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ నుంచి డాక్టర్ సుధను అభ్యర్థిగా నిలబెడుతున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు.

Update: 2021-09-30 09:06 GMT

Badvel Bypoll: బద్వేల్ లో వైసీపీ విజయం ఖాయం- దాసరి సుధ

Badvel Bypoll: బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ నుంచి డాక్టర్ సుధను అభ్యర్థిగా నిలబెడుతున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. బద్వేల్ ఉప ఎన్నికపై జగన్ ప్రత్యక సమావేశం నిర్వహించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి బద్వేల్ వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా, పలువురు మంత్రులు, కడప జిల్లా వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. బద్వేల్ నియోజకవర్గ బాధ్యతలన్నీ సమావేశానికి వచ్చిన వారందరి మీద ఉన్నాయన్నారు జగన్. 2019లో దాదాపు 44వేలకు పైగా ఓట్ల మెజార్టీ వచ్చిందని, గతంలో వెంకట సుబ్బయ్యకు వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీ డాక్టర్ సుధ కి రావాలని తెలిపారు. అందరూ ఓట్లు వేసేలా ఓటర్లను ప్రోత్సహించాలని సీఎం జగన్ సూచించారు.

బద్వేల్ ఉప ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందన్నారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి సుధ. 2019 ఎన్నికల కంటే అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తామన్నారామె. జగన్ చేస్తున్న అభివృద్ధే తనను గెలుపిస్తాయన్నారు. 

Full View


Tags:    

Similar News