అంతర్జాతీయ నాయకులు ఇక్కడికి..విశాఖ పర్మిషన్.. చంద్రబాబుపై వైసీపీ ఎంపీ వ్యంగ్యాస్త్రాలు

టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Update: 2020-05-24 10:14 GMT
Chandrababu Naidu, MP vijayasai Reddy(File photo)

టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.ఈ మేరకు ట్విటర్‌ ఖాతాలో.. 'యూ టర్న్ అంకుల్... విశాఖకు పర్మిషన్ కేంద్రాన్ని అడిగారు కదా.. వారేమన్నారో చెప్పండి.. మీబోటి అంతర్జాతీయ నాయకులు అంతలోనే యూ టర్న్ తీసుకుని మా రాష్ట్ర డీజీపీని పర్మిషన్ అడగటం ఏమిటి చెప్పండి?' అంటూ విజయసాయిరెడ్టి ట్వీట్‌ చేశారు.

'చిత్తుగా ఓడాక ఫ్రస్ట్రేషన్ పెరిగి మెంటల్ కండిషన్ సీరియస్ అయి ఉండొచ్చుకాని రెండు మూడేళ్ల క్రితమే పిచ్చి ముదిరింది. అప్పటి మాటలు అలాగే ఉన్నాయి. బావుల అనుసంధానం చేస్తానని అంటే, ఎల్లో మీడియా 'విజనరీ' వాక్కులకు ఒక రేంజిలో ఎలివేషన్ ఇచ్చి అచ్చేసింది' అని విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు.

కరోనా నుంచి కోలుకున్న రోగుల జాతీయ సగటు 40 శాతం కంటే లోపే ఉంది. ప్రపంచ యావరేజి కూడా ఇంచుమించు ఇంతే. సిఎం జగన్ గారు తీసుకున్న ప్రత్యేక చర్యలు, వైద్య సిబ్బంది అత్యుత్తమ చికిత్స అందించడం వల్ల రాష్ట్రంలో రికవరీ రేటు 68 శాతంగా రికార్డయింది. ప్రాణాంతక వైరస్ పై ఇది అసాధారణ విజయం. అంటూ మరో ట్వీట్ చేశారు.




 


Tags:    

Similar News