Mohammed Karimunnisa: ఎమ్మెల్సీ మహ్మద్‌ కరీమున్నీసా గుండెపోటుతో మృతి

*ఎమ్మెల్సీ మహ్మద్‌ కరీమున్నీసా గుండెపోటుతో మృతి *నిన్న ఉదయం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఎమ్మెల్సీ

Update: 2021-11-20 02:21 GMT

ఎమ్మెల్సీ మహ్మద్‌ కరీమున్నీసా గుండెపోటుతో మృతి(ఫైల్ ఫోటో)

Mohammed Karimunnisa: కృష్ణా జిల్లా వైసీపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ మహ్మద్‌ కరీమున్నీసా నిన్న రాత్రి గుండెపోటుతో చనిపోయారు. ఉదయం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఆమె రాత్రి అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆస్పత్రికి తీసుకువెళ్లిన కొద్దిసేపటికే ఆమె తుది శ్వాస విడిచారు. గతంలో 54వ వార్డు కార్పొరేటర్‌గా ఉన్న ఆమెకు ముస్లిం మైనార్టీలో ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది.

కరీమున్నీసా కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీలో చేరి పార్టీ స్థాపించిన రోజు నుంచి క్రియాశీలకంగా వ్యవహించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 56వ డివిజన్ కార్పొరేటర్‌గా పనిచేశారు.

కరీమున్నీసాకు సీఎం జగన్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఈ ఏడాది మార్చి 8న ఆమె శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇంతలోనే గుండెపోటుతో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఎమ్మెల్సీ మృతి పట్ల వైఎస్సార్సీపీ నేతలు, రాజకీయా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Full View


Tags:    

Similar News