వైసీపీలో ఆధిపత్య పోరు.. డిప్యూటీ సీఎంపై రోజా ఆగ్రహం

అధికార పార్టీ వైసీపీలో నేతల మధ్య ఆధిపత్య పోరు మరింత ముదిరినట్లే కనిపిస్తోంది.

Update: 2020-05-26 13:52 GMT
Roja (File Photo)

అధికార పార్టీ వైసీపీలో నేతల మధ్య ఆధిపత్య పోరు మరింత ముదిరినట్లే కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యే రోజా మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. తనకు సమాచారం ఇవ్వకుండానే తన నియోజకర్గంలో నారాయణస్వామి పర్యటించారని రోజా మండిపడ్డారు. నియోజకర్గంలో తాను అందుబాటులోనే ఉన్నా పట్టించికోలేదని, ప్రొటోకాల్ ఉల్లంఘించారని రోజా విమర్శించారు.

వివాదం వివరాల్లోకి వెళ్తే.. రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజవర్గం పుత్తూరులో డిప్యూటీ సీఎం నారాయణస్వామి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ్ గుప్తా పుత్తూరులో పర్యటించారు. దళితులకు కల్యాణమంటపం స్థల సేకరణ కోసం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఖాళీ భూమిని పరిశీలించారు. అయితే, ఈ కార్యక్రమానికి రోజాను పిలవకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా రోజా నియోజకవర్గ పరిధిలో ఆమెకు వ్యతిరేకంగా ఉన్న వర్గానికి నారాయణస్వామి అండగా ఉన్నారనే భావనలో ఉన్నారు. అంతే కాకుండా చిత్తూరులో కొన్ని రోజులుగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎమ్మెల్యే రోజా మధ్య వివాదం నడుస్తున్నట్లు సమాచారం.


Tags:    

Similar News