Mekathoti Sucharita: నా భర్త పార్టీ మారితే నేను కూడా ఆయనతోనే వెళ్తా
Mekathoti Sucharita: భార్యగా తన భర్త అడుగుజాడల్లోనే నడుస్తానన్న సుచరిత
Mekathoti Sucharita: నా భర్త పార్టీ మారితే నేను కూడా ఆయనతోనే వెళ్తా
Mekathoti Sucharita: పార్టీ మారడంపై ఏపీ మాజీ హోంమంత్రి, ప్రత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఎప్పుడూ జగన్‌తోనే ఉంటామని ఆమె చెప్పారు. తాను చెప్పిన దానికి తన భర్త దయాసాగర్ కూడా కట్టుబడి ఉంటారని వెల్లడించారు. ఒకవేళ తన భర్త పార్టీ మారతాను, నీవు కూడా నాతో రా అని పిలిస్తే ఒక భార్యగా తాను కచ్చితంగా తన భర్త అడుగుజాడల్లోనే నడుస్తానని చెప్పుకొచ్చారు. తన భర్త ఒక పార్టీలో, తాను మరో పార్టీలో, తన పిల్లలు ఇంకో పార్టీలో ఉండబోమని సుచరిత తెలిపారు. తామంతా వైసీపీ కుటుంబ సభ్యులమని స్పష్టం చేశారు. జగన్ పార్టీలో తాము ఉండగలిగినంత కాలం ఉంటామని తెలిపారు. గుంటూరు జిల్లా కాకుమానులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.