పార్టీ మార్పుపై స్పందించిన వైసీపీ నేత యార్లగడ్డ

Update: 2019-10-27 01:27 GMT

సీఎం జగన్ ను గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కలవడంతో వైసీపీలో కలకలం రేగుతోంది. ప్రస్తుతం వైసీపీ ఇంఛార్జిగా ఉన్న యార్లగడ్డ వెంకటరావు వర్గం ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతోంది. వంశీ వైసీపీలోకి వస్తే తమ నేత పరిస్థితి ఏంటని యార్లగడ్డ వర్గం వైకాపా అధిష్టానంపై గుర్రుగా ఉంది. ఈ క్రమంలో యార్లగడ్డ వెంకటరావు వైసీపీని సైతం వీడతారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై యార్లగడ్డ వెంకటరావు స్పందించారు.. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. 'సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుండి క్షణం తీరిక లేకుండా కార్యకర్తల మధ్యనే ఉన్నా ఇంతలోనే పార్టీ మారెందుకు మాజీ మంత్రితో మాట్లాడినట్లు విష ప్రచారం చేస్తున్నారు..దీన్ని ఖండిస్తున్నాను...

నేను ఎక్కడికి పోను గన్నవరం లొనే ఉంటా, వైసిపిని వీడే ప్రస్నే లేదు . పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటాను. ఎవరూ భయాందోళనకు గురి కావద్దు. మనకు అన్యాయం జరుగదు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిపై పూర్తి నమ్మకంతో ఉన్నా. దాదాపు 10ఏళ్లుగా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న వారికి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిస్థాయి న్యాయం చేస్తారు.' అని పేర్కొన్నారు యార్లగడ్డ వెంకటరావు. 

Tags:    

Similar News