చెట్టెక్కి మతిస్థిమితం​లేని మహిళ హల్‌చల్‌

Update: 2019-10-15 11:51 GMT

ఓ మహిళ చెట్టెక్కి హల్‌చల్‌ చేసిన సంఘటన విజయవాడలో జరిగింది. స్థానిక కాందారీ రోడ్‌లో ఉన్న అగ్రిగోల్డ్‌ భవనం పక్కన పెద్ద చెట్టు ఉంది. ఓ మహిళ ఆ చెట్టెక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ బెరించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. అతి కష్టం మీద చెట్టుమీదున్న మహిళను కిందకి దించారు. అయితే ఆమెకు మతిస్థిమితం లేనట్టుగా పోలీసులు గుర్తించారు. చెట్టెక్కే క్రమంలో చిన్న చిన్న గాయాలు కావడంతో బాధిత మహిళను ఆసుపత్రికి తరలించారు పోలీసులు.

Tags:    

Similar News