AP Weather Update: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు
Andhra Pradesh Weather Update: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రెండు రోజుల్లో శ్రీలంక, తమిళనాడు వైపు ఈ అల్పపీడనం పయనిస్తోంది.
Weather Update: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు
Andhra Pradesh Weather Update: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రెండు రోజుల్లో శ్రీలంక, తమిళనాడు వైపు ఈ అల్పపీడనం పయనిస్తోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుండటంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని తెలిపింది.
ఇందులో ముఖ్యంగా పశ్చిమగోదావరి, వైఎస్సార్, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కృష్ణ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ వర్షాలు దంచికొడతాయిన అధికారులు తెలిపారు.
అలాగే కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలోని పలు ప్రాంతాల్లో అల్పపీడనం కారణంగా తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఇప్పటికే నిండుకుండల్లా ఉన్న చెరువులు, నదులు, రిజర్వయర్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని, సముద్ర తీర ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది.