నిప్పుల కొలిమి..అత్యవసరమైతే తప్ప అప్పటి వరకు బయటకు రావద్దు

కరోనా వైరస్ వ్యాప్తితో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందుతుంటే.. మ‌రోవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి.

Update: 2020-05-24 05:27 GMT

కరోనా వైరస్ వ్యాప్తితో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందుతుంటే.. మ‌రోవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాలలో ఎండలు నిప్పుల కుంప‌టిని త‌ల‌పిస్తున్నాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే ప‌రిమిత‌మ‌యిన‌ ప్ర‌జానీకం.. ఇప్పుడు ప‌డ‌లింపుల‌తో అడుగు బ‌య‌ట‌పెడ‌దామంటే వడగాలులకు వ‌ణుకితున్నారు.

ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్ర‌జ‌ల‌కు హెచ్చరికలు జారీ చేసింది. మరో ఆరు రోజుల పాటు అత్యవసరమైతే మినహా ఎవరు బయటికి రావద్దని హెచ్చ‌రించింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉన్నందున ఎవ‌రిని అడుగు బ‌య‌ట పెట్టొద్ద‌ని సూచించింది.

మే 28వ తేదీ వరకు భానుడి ప్ర‌తాపం ఇలానే ఉంటుంద‌న్న వాతావ‌ర‌ణ శాఖ‌ ఏపీలో ముఖ్యంగా.. గుంటూరు, కృష్ణా, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు తీవ్రంగా ఉంటాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. వాతావ‌ర‌ణంలో 29 నుంచి మార్పులు సంభ‌విస్తాయ‌ని ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Tags:    

Similar News