ఏపీలో ఎంఫాన్ తుపాను ముప్పు.. వార్తల్లో నిజం లేదు : వాతావరణ శాఖ

Update: 2020-05-06 07:49 GMT

ఏపీలో ఎంఫాన్ తుపాను ముప్పు పొంచి ఉందన్న వార్తల్లో నిజం లేదని వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీకి ఎంఫాన్ తుపాను ముప్పు తప్పిందని అధికారులు పేర్కొన్నారు. వాతావరణంలో ఉన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడలేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల మీదుగా దక్షిణ తమిళనాడు వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. వచ్చే 24 గంటల్లో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

అయితే ఇటీవలే జరిగిన సమీక్ష సమవేశంలో సీఎం జగన్ ఎంఫాన్ తుపాను ముప్పు ఉంటే తీర ప్రాంతాల్లో వారిని హెచ్చరించాలని, ఎటువంటి నష్టం వాటిల్లకుండా చూడాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.


Tags:    

Similar News