శ్రీశైలం జలాశయంలోకి వరద నీరు ఆగిపోయిందని అనుకున్నారు.. ఇటు చూస్తే..

శ్రీశైలం జలాశయంలోకి వరద నీరు ఆగిపోయిందని అనుకున్నారు.. ఇటు చూస్తే..

Update: 2019-09-23 01:59 GMT

ఎగువనుంచి వరదనీరు తగ్గడంతో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు మూసివేశారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 68,601 క్యూసెక్కులు ఉండగా,ఔట్‌ ప్లో 75,817 క్యూసెక్కులుగా నమోదయింది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.90 అడుగులుగా ఉంది. శ్రీశైలంలో జలాశయంలోకి వరద నీరు ఆగిపోయిందని ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో కడప, నెల్లూరు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు నెల్లూరు జిల్లాలోని సోమశిలా జలాశయం నిండు కుండగా మారింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది.ఇన్‌ఫ్లో 92,343 క్యూసెక్కులు కాగా, ఔట్‌ ఫ్లో 22,243 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 78 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 65 టీఎంసీలుగా ఉంది.

Tags:    

Similar News