Rajahmundry: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలి

అందరూ నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.

Update: 2020-03-15 14:30 GMT

రాజమండ్రి: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ఏజెన్సీ లోని ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని ఏలూరు రేంజ్ డిఐడి కెవి మోహన్ రావు జిల్లా ఎస్ పి అద్నాన్ నయిం అస్మి, రాజమహేంద్రవరం అర్బన్ ఎస్ పిడాక్టర్ బాజపాయ తెలిపారు. ఆదివారం ఉదయం రాజమహేంద్రవరం జిల్లా పోలీసు కార్యాలయం లో ఆంధ్ర, తెలంగాణ మరియు చత్తిస్ ఘడ్ రాష్ట్రాలకు చెందిన పోలీసు అధికారులతో కలిసి అంతర్రాష్ట్ర సమావేశం నిర్వహించినారు.

ఈ సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించటానికి చేపట్టవలసిన చర్యల గురించి బాధ్యత దానికి కావాల్సిన ఏర్పాట్లకు ప్రణాళిక రూపొందించామన్నారు. ప్రజలందరూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేలా చేయడం మన బాధ్యతని అందుకుగాను మనమందరం పక్కా ప్రణాళికతో ఏజెన్సీ ప్రాంతంలో మావోల దుశ్చర్యలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అదేవిధంగా ఇక్కడ సమావేశంలో పాల్గొన్న రాష్ట్రాల అధికారులు మావోయిస్టుల దుశ్చర్యలను కట్టడి చేయడానికి సంయుక్తంగా చేయాల్సిన ఏర్పాట్లు గురించి చర్చించారు. ఏజన్సీ ప్రాంతాలలోని ఓటర్లు అందరూ నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో రంపచోడవరం ఓఎస్ డి ఆరిఫ్ హాఫిజ్, కొత్తగూడెం ఓఎస్ డిఎ. రమణారెడ్డి, సుకుమాడిఎస్ పి అనిల్ విశ్వకర్మ గారు, పోలవరం ఎస్ డిపిఓఎం. వెంకటేశ్వర రావు గారు మరియు కొత్తగూడె , పోలవరం, సుకుమా ( చత్తిస్ ఘడ్ ) ప్రాంతాల పోలీస్ అధికారులు, ఇతర ముక్యమైన పోలీస్ అధికారులు హాజరైనారు .


Tags:    

Similar News