Vizag: విశాఖ వేదికగా ఇన్ఫినిటీ సమ్మిట్ 2023
Vizag: విశాఖను ఐటి ఐకాన్ గా మార్చేందుకు అడుగులు
Vizag: విశాఖ వేదికగా ఇన్ఫినిటీ సమ్మిట్ 2023
Vizag: సాగరతీరం ఐటి హబ్‌గా మారబోతోంది ఏపీలో ఐటి రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం దిశానిర్దేశం చేస్తోంది . ముఖ్యంగా విశాఖను ఐటి ఐకాన్ గా మార్చేందుకు అడుగులు వేస్తోంది . స్టార్టప్‌లను విశాఖలో ఏర్పాటు చేసేందుకు ప్రోత్సహిస్తున్నారు అందుకు విశాఖలో నిర్వహిస్తున్న ఇన్ఫినిటీ ఐటీ సమ్మిట్ వేదికగా నిలిచింది.
విశాఖలో నిర్వహించిన ఇన్ఫినిటీ 2023 సదస్సు ఏపీలో ఉత్పాదక సంస్థలపై ప్రత్యేక దృష్టి సారించింది. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఆకర్షణలో ఏపీ ముందడుగు వేసింది. సత్యవేడు శ్రీ సిటీలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో ప్రాధాన్యత అనంతపూర్ లో డ్రోన్ టెక్నాలజీ విశాఖలో ఐటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయబోతున్నారు. విశాఖతో పాటు ఏపీలో ఐటీ రంగం అభివృద్ధిపై చర్చ సాగింది. ఐటీ రంగంలో నూతన సాంకేతిక అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు నిపుణులు చెప్తున్నారు.
వైజాగ్ ఐటి రంగంలో షైనింగ్ స్టార్ గా మారుతోందని సెయింట్ ఐటి వ్యవస్థాపకులు మోహన్ రెడ్డి అన్నారు. ఐటి అభివృద్ధికి విశాఖలో అన్ని రకాల అవకాశాలు ఉన్నాయని ప్రస్తావించారు. 2015 నుంచి స్టార్ట్ అప్ ల విధానం భారత్ లో అమల్లోకి వచ్చిందని ఈ ఏడేళ్లలో ప్రపంచంలోనే భారత్ మూడో స్థానం స్టార్టప్‌ల్లో నిలిచిందన్నారు. ఇన్ఫినిటీ వైజాగ్ 2023 ద్వారా ఐటీ రంగం అభివృద్ధికి అవకాశాలు ఉంటాయని అభిప్రాయం వ్యక్తంచేశారు. పిల్లలను బాగా చదివిస్తే ఐటీ రంగంలో నిపుణులుగా రాణించి పదుగురికి ఉపాధి అవకాశాలను కల్పిస్తారని మోహన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తంచేశారు.