Visakhapatnam: కరోనా దృష్ట్యా మరిన్ని రైతు బజార్లు

మైదానాన్ని పరిశీలించి కూరగాయల షాపులు ఏ విధంగా ఏర్పాటుకు తక్షణమే చర్యలను చేపట్టాలని ఎ.డి.ని ఆదేశించారు.

Update: 2020-03-25 13:01 GMT
collector Siva Shankar

విశాఖపట్నం: కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి, ప్రజలు సామాజిక దూరం పాటించేందుకు రద్దీగా ఉండే సీతమ్మధార రైతు బజారుతో పాటు మరిన్ని రైతు బజార్లు అందుబాటులో ఉంటాయని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్. శివ శంకర్ తెలిపారు. బుధవారం సీతమ్మధార రైతు బజారును రాష్ట్ర పర్యాటక, సాంస్కృతి శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో ఆయన సందర్శించారు. సీతమ్మధార రైతు బజారులో షాపులు దగ్గర దగ్గరలో ఉన్నందు వలన కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకున్న చర్యల్లో భాగంగా ప్రజలకు అందుబాటులోకి మరిన్ని రైతు బజార్లు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.

సీతమ్మధార రైతు బజారు, కె.ఆర్.ఎం. కాలనీ, సీతమ్మధార, బాలయ్యశాస్త్త్రి లే అవుట్, నక్కవానిపాలెం, క్రాంతినగర్ ప్రజలకు అందుబాటులో ఉంటుందని అన్నారు. ఉక్కు కళామందిర్ రైతు బజారు, హెబి కాలనీ, ఎంఎంపీ కాలనీ, సింహాద్రిపురం, పాత వెంకోజిపాలెం, మద్దిలపాలెం ప్రజలకు అందుబాటులో ఉంటుందని అన్నారు. బుల్లయ్య కళాశాల రైతు బజారు రేసపువానిపాలెం, మద్దిలపాలెం, సి.బి.ఎం. కాంపౌండ్, శ్రీనగర్, శాంతిపురం ప్రజలకు అందుబాటులో ఉంటుందని అన్నారు. ఆయా ప్రాంత ప్రజలు సంబంధిత రైతు బజారులను ఉపయోగించుకొని కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి సహకరించవలసినది ఆయన కోరారు.

ప్రజలు రైతు బజారులలో గుంపులుగా కాకుండా కుటుంబంలో ఒకరు చొప్పున వచ్చి కారగాయలను కొనుగోలు చేయాలని ఆయన తెలిపారు. అనంతరం బుల్లయ్య కళాశాల మైదానంను ఆయన సందర్శించారు. మైదానాన్ని పరిశీలించి కూరగాయల షాపులు ఏ విధంగా ఏర్పాటుకు తక్షణమే చర్యలను చేపట్టాలని ఎ.డి.ని ఆదేశించారు. ఈ పర్యటనలో సీతమ్మధార అర్బన్ తహసిల్థార్ ఎ. జ్ఞానవేణి, జివిఎంసి సిఎంఓ డా. శాస్త్రి, మార్కెటింగ్ శాఖ ఎడి కాలేశ్వరరావు, సీతమధార రైతు బజారు ఎస్టేట్ అధికారి, తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News