'గోదారమ్మ మైలపడింది.. చుక్కనీరు ముట్టం'

దైవంగా భావిస్తున్న గోదారమ్మతల్లి ఒడిలో ఘోర విషాదం చోటుచేసుకోవడంతో ఆ ప్రాంత ప్రజలు గోదావరి నీటిని ముట్టుకోవడానికి ఇష్టపడటంలేదు.

Update: 2019-09-22 06:04 GMT

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు గోదావరి నదిలో బోటు ప్రమాదం జరిగి సరిగ్గా నేటికీ వారంరోజులు పూర్తయింది. ఇప్పటికి 37 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 14 మృతదేహాల ఆచూకీ లభించాల్సి ఉంది. ప్రస్తుతం మృతదేహాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దైవంగా భావిస్తున్న గోదారమ్మతల్లి ఒడిలో ఇంత ఘోర విషాదం చోటుచేసుకోవడంతో ఆ ప్రాంత ప్రజలు గోదావరి నీటిని ముట్టుకోవడానికి ఇష్టపడటంలేదు. ఇండుగ పిక్కలు లేదా, స్పటికను వినియోగించి నీటిని శుద్ధిచేసుకుని మరీ గోదావరి నీటిని వినియోగిస్తారు. అలాంటిది కచ్చులూరు గ్రామంతో పాటు దేవీపట్నం మండలం గోదావరి దిగువన ఉన్న మరో 10 గ్రామాలకు చెందిన150 కుటుంబాలు వంటా, వార్పుకోసం బోరు నీరు, చెలిమలో లభించే నీటిని మాత్రమే వాడుతున్నారు.

ప్రస్తుతం గోదావరమ్మ మైలపడింది.. గోదావరిలో ఉన్న మృతదేహాలన్నీ బయటకు తీసి శుద్ధిచేసే వరకూ చుక్క నీటిని కూడా ముట్టమంటున్నారు. అధికారులు కూడా తమకు నీళ్ల ట్యాంకర్లను ఏర్పాటు చెయ్యాలని కోరుతున్నారు. మరోవైపు ఆ ప్రాంతంలో ప్రస్తుతం గోదావరి నీటిని వినియోగించకపోవడమే మంచిదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. నీటిలో ఉన్న మృతదేహాలను చేపలు కొరకడంతో పాడైపోయివుంటాయి. దాంతో మృతదేహం శరీరంలో ఉన్న మలిన పదార్ధాలు గోదావరి నీటిలో కలుషితం అయి ఉండవచ్చని అంటున్నారు. వాస్తవానికి పారే నీరు ప్రమాదకరం కాదు. అయినా వీరిలో భయం మాత్రం ఆవహించి ఉంది. గొంతు తడుపుకునేందుకు గోదారి ఉన్నా.. మైలపడిందన్న కారణంతో మట్టినీరునే వారంతా తాగడం విశేషం.

Tags:    

Similar News