Vijayawada: తుని రైలు దగ్ధం కేసును కొట్టివేసిన విజయవాడ రైల్వే కోర్టు

Tuni Rail Case: 41 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు

Update: 2023-05-01 10:43 GMT

Vijayawada: తుని రైలు దహనం కేసు కొట్టివేత.. విజయవాడ రైల్వే కోర్టు తీర్పు

Tuni Rail Case: తుని రైలు దగ్ధం కేసును విజయవాడ రైల్వే కోర్టు కొట్టివేసింది. కేసులో నిందితులుగా ఉన్న 41 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. సున్నితమైన అంశాన్ని ఐదేళ్లపాటు సాగదీశారని వ్యాఖ్యానించింది న్యాయస్థానం. ఈ కేసులో పోలీస్ ఉన్నతాధికారులపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఐదేళ్లో ఒక్క సాక్షిని మాత్రమే ప్రవేశపెట్టారని విచారణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆధారాలు లేని కారణంగా 41 మందిపై నమోదు చేసిన కేసులను అక్రమ కేసులుగా పరిగణిస్తున్నామని తెలుపుతూ.. కేసును కొట్టివేసింది.

కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్‌తో 2016 జనవరి 31న తునిలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో వేలాది మంది కార్యకర్తలు పాల్గొనగా.. అక్కడ అల్లర్లు చెలరేగాయి. ఈ నేపథ్యంలో అక్కడ రత్నాకర్‌ ఎక్స్‌ప్రెస్‌ను దగ్ధం చేశారు. దీంతో సభకు పిలుపునిచ్చిన ముద్రగడ పద్మనాభంతో సహా 41 మందిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే వీటిని ఆధారాలు లేని కారణంగా అక్రమ కేసులుగా పరిగణిస్తూ కోర్టు కొట్టివేసింది.

Tags:    

Similar News