రాజధానిపై విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు

రాజధాని భీమిలి పట్టణం ఎదిగేందుకు అవకాశం ఉందని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.

Update: 2019-12-21 15:29 GMT
Vijaya sai reddy

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో సచివాలయం సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాని జీఎన్ రావు కమిటీ నివేధిక ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖకు తరలించడం వల్ల రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు బాగుపడాయని అభిప్రాయపడ్దారు. శనివారం కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలని విజయసాయి రెడ్డి ఆకాంక్షించారు. విశాఖలో భీమిలీని కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.

రాజధాని భీమిలి పట్టణం ఎదిగేందుకు అవకాశం ఉందని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. భీమిలిలో రాజధాని ఏర్పాటు సంతోషమన్నారు. వక్తిత్వం లేవి వారి మాటలు పట్టిచుకోవాల్సిన అవసరం లేదని విజయసాయి రెడ్డి దుయ్యబట్టారు. అయితే వైసీపీ ఎంపీ విజసాయి రెడ్డి వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

రాజధాని, ఏపీ సమగ్రాభివృద్ధిపై అధ్యయనం కోసం ఏర్పాటైన జీఎస్‌రావు కమిటీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి తుది నివేదిక అందజేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించిన జీఎస్‌రావు కమిటీ సభ్యులు ప్రజల నుంచి సూచనలను సలహాలు అభిప్రాయాలను సేకరించారు. విశాఖ, కర్నూలు, అమరావతితోపాటు ఇతర ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలించి అధ్యయనం చేశారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా తమకు అందిన 40వేలకు పైగా వినతులను కమిటీ పరిశీలించింది. అయితే, అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చెప్పినట్లుగానే కర్నూలులో హైకోర్టు అనుబంధ కోర్టులు ఏర్పాటు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. సీఎం స్టేట్‌మెంట్‌కు అదనంగా కర్నూలులో అసెంబ్లీ వింటర్ సెషన్స్‌ను నిర్వహించాలని సూచించింది.

అదేవిధంగా అమరావతిలో అసెంబ్లీ, రాజ్‌భవన్‌తోపాటు మినిస్టర్స్ క్వార్టర్స్‌, వివిధ శాఖల కార్యాలయాలు, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. ఇక, విశాఖలో సచివాలయం, సీఎం క్యాంప్ కార్యాలయం, హైకోర్టు బెంచ్ ఏర్పాటుతోపాటు అసెంబ్లీ సమ్మర్ సెషన్స్‌ నిర్వహించాలని సూచించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News