అన్నమయ్య జిల్లాలో విషాదం.. ఇద్దరు వృద్ద దంపతులు ఆత్మహత్య
Andhra Pradesh: సివిల్ మ్యాటర్ కేసులో స్టేషనుకు రావాలన్న పోలీసులు.. అవమానంగా భావించి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ఇద్దరు వృద్ద దంపతులు ఆత్మహత్య
Andhra Pradesh: అన్నమయ్య జిల్లా మదనపల్లి లో విషాదం చోటు చేసుకుంది. పరువుతో బ్రతుకుతున్న ఓ వృద్ద దంపతులను సివిల్ మ్యాటర్ కేసులో పోలీస్ స్టేషనుకు రావాలని పోలీసులు ఆదేశాలు జారీ చేయడంతో అవమానంగా భావించి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెలుగు చూసింది. ఆత్మహత్య చేసుకున్న దంపతులు మదనపల్లెలో నివాసం ఉంటున్నారు.
తంబళ్లపల్లి మండలంలోని మొరుసుపల్లి బురుజుకు చెందిన గుట్టపాలెం నరసింహులు నాయుడు, అతని భార్య జి.వెంకటసుబ్బమ్మ లను పోలీసులు స్టేషనుకు రావాలని బెదిరించారు. మదనపల్లి పట్టణం అనుపగుట్టలో నివాసం ఉంటున్న వారిపై నరసింహులు తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. తమకు ఆస్తి రాసివ్వడం లేదని వారు చేసిన ఫిర్యాదుతో సివిల్ మ్యాటర్ లో పోలీసులు ఎంటరయ్యారు. ఆ వృద్ద దంపతులను స్టేషనుకు రావాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో మనస్తాపం చెందిన వృద్ద దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల బెదిరింపులే వారి ఆత్మహత్య కు కారణంమని మృతుల బంధువులు తెలిపారు.