Tuni Minor Rape Case: తుని రేప్ కేసు ట్విస్ట్ .. చెరువులో మృతదేహంగా నిందితుడు గుర్తింపు

కాకినాడ జిల్లా తుని పట్టణంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నారాయణరావు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

Update: 2025-10-23 05:32 GMT

Tuni Minor Rape Case: తుని రేప్ కేసు ట్విస్ట్ .. చెరువులో మృతదేహంగా నిందితుడు గుర్తింపు

కాకినాడ జిల్లా తుని పట్టణంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నారాయణరావు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. తుని కోమటి చెరువులో అతని శవాన్ని గజ ఈతగాళ్లు బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పోలీసుల ప్రకారం, నిన్న నారాయణరావును అదుపులోకి తీసుకొని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకెళ్తుండగా, వాహనం ఆపమని చెప్పి తప్పించుకున్నాడు. వెహికల్ ఆగిన వెంటనే సమీపంలోని చెరువులోకి దూకాడని పోలీసులు తెలిపారు.

ఏం జరిగింది?

కొన్ని రోజుల క్రితం తుని పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఓ పార్టీకి చెందిన స్థానిక నాయకుడు నారాయణరావు, ఓ మైనర్ బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఆ బాలికను “ఇంటికి తీసుకెళ్తాను” అంటూ స్కూల్ నుంచి తీసుకెళ్లినట్లు సమాచారం.

వీడియో బయటకు రావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణరావును ప్రశ్నించగా, అతడు తాను కౌన్సిలర్ అని చెప్పుకుంటూ వారిని బెదిరించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ — “మా అనుమతి లేకుండా స్కూల్‌ నుంచి అమ్మాయిని ఎలా పంపారు?” అని ప్రశ్నించారు.

ఈ ఘటన తర్వాత గ్రామస్థులు నిందితుడిపై ఆగ్రహంతో దేహశుద్ధి చేసినట్లు సమాచారం. ఇప్పుడు నిందితుడి ఆత్మహత్యతో ఈ కేసు మరింత కలకలం రేపుతోంది.

Tags:    

Similar News