Tungabhadra Pushkaralu 2020: ఈరోజు నుంచి తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం

* ప్రత్యేక పూజలతో పుష్కరాలను ప్రారంభించనున్న సీఎం జగన్ * కోవిడ్ కారణంగా నదీలో స్నానాలకు అనుమతించని ప్రభుత్వం * కేవలం జల్లుల స్నానానికి మాత్రమే అనుమతి * కర్నూలు జిల్లాలో 23 ఘాట్లు ఏర్పాట్లు * ఈ-టికెట్‌ ద్వారానే పిండప్రదానాలకు అనుమతి * భక్తులు కరోనా నిబంధనలు పాటించాలని అధికారుల సూచన

Update: 2020-11-20 03:54 GMT

నాగరీకతలన్నీ నదీ తీరాల్లోనే వెలిశాయి. భారతీయ సంస్కృతి జీవన విధానం నదులతో పెనవేసుకుంది. అందుకే నదీస్నానాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు. చాలా పుణ్యక్షేత్రాలు నదీ తీరాల్లోనే వెలిశాయి. ప్రతి నదీకి 12 ఏళ్లకోక సారి పుష్కరాలు జరుగుతుంటాయి. నదీమ పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలు ఇవాల్టీ నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 1.21 గంటలకు బృహస్పతి మకర రాశిలోకి ప్రవేశించినంత తర్వాతనే పుష్కరాలు మొదలవుతాయి. కర్నూలులో ఏర్పాటు చేసిన సంకల్‌భాగ్ ఘాట్‌లో సీఎం జగన్ వేడుకలను ప్రారంభించనున్నారు. అందుకోసం అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు..

ఈ ఏడాది కోవిడ్ కారణంగా పుష్కరాల్లో పుణ్య స్నానాలకు అనుమతిని ఇవ్వలేదు. కేవలం చేతితో మాత్రేమే నదీ నీళ్లను జల్లుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఉదయం ఆరింటి నుంచి సాయంత్రం ఆరింటి వరకు మాత్రమే ఘాట్‌లోకి భక్తులను అనుమతిస్తామన్నారు. పుష్కరాల సందర్భంగా ఘాట్‌ల వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా గజఈతగాళ్లను అందుబాటులో ఉంచారు.

తుంగభద్ర నదీ ఏపీలో కర్నూలు జిల్లాలో మాత్రమే ప్రవహిస్తుంది. కర్ణాటకలో ప్రవహించిన అనంతరం మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం మేళిగనూరు దగ్గర ఏపీలోకి ప్రవేశిస్తుంది. 156 కిలోమీటర్ల మేర మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, నందికొట్కూరు నియోజకవర్గాలలో ప్రవహించాక కొత్తపల్లి మండలం సంగమేశ్వరం వద్ద కృష్ణానదీలో కలుస్తుంది. నదీ పరివాహక ప్రాంతంలో 23 పుష్కర ఘాట్లను ప్రభుత్వం నిర్మించింది. ఘాట్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పించింది.

Tags:    

Similar News