టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు

టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.

Update: 2019-12-28 17:11 GMT
TTD File Photo

టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా వైఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన ప్రధానార్చకులు రమణ దీక్షితులును గౌరవ ప్రధాన అర్చకునిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తిరుమల శ్రీవారి ఆలయంపై దీక్షితులు మళ్లీ పట్టు సాధించినట్లయింది.

తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులను నియమిస్తూ టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది..గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి ఆలయ అర్చకులకు ఉద్యోగ విరమణ నిబంధనలను వర్తింపజేయడంతో రమణ దీక్షితులు ప్రధాన అర్చకుడి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయనకు మంచిరోజు లొచ్చాయి..ఇప్పటికే ఆగమ శాస్త్ర సలహా మండలి సభ్యుడిగా దీక్షితులకి అవకాశం కల్పించిన టీటీడీ పాలక మండలి ఇప్పుడు ఆయనను శ్రీవారి ఆలయ ప్రధాన గౌరవ అర్చకుడిగానియమించింది. ఇప్పటికే దీక్షితులు కుమారులు రాజేష్ దీక్షిత్, కుమార దీక్షిత్ గోవింద రాజస్వామి ఆలయం నుంచి తిరుమల శ్రీవారి ఆలయానికి బదిలీ అయ్యారు.

రమణ దీక్షితులుకు పూర్తి స్థాయి అధికారాలు దక్కడంతో గతంలో ఆయన చేసిన ఆరోపణలపై విచారణ జరుపుతారా?అన్న ప్రశ్నలు మళ్లీ ఉదయిస్తున్నాయి. శ్రీవారి ఆలయంలో అరాచకాలు జరుగుతున్నాయని, స్వామి వారికి కనీసం నైవేద్యం కూడా పెట్ట కుండా పస్తులుంచుతున్నారని ఆయన గతంలో తీవ్ర ఆరోపణలు చేశారు. ఆగమ శాస్త్రం ప్రకారం అనుసరించాల్సిన పద్ధతులకూ తిలోదకాలిచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదుస్వామి వారి నగలు మాయమైయ్యాయని, ఖండాంతరాలకు తరలిపోయాయనీ కామెంట్ చేశారు.. శ్రీవారి నగల్లో పింక్ డైమండ్ ఏమైందంటూ నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో అవన్నీ విదేశాలకు తరలి పోయాయని అన్నారు.

ఇప్పుడు రమణదీక్షితులకి పూర్వ వైభవం దక్కడంతో ఈ ఆరోపణలన్నింటిపైనా విచారణ జరుపుతారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.మరోవైపు రమణ దీక్షితుల నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు అర్చకులు టీటీడీపాలకమండలి ఛైర్మన్ వై.వీ. సుబ్బారెడ్డిని కలిసినట్లు..అయితే ఎలాంటి భయాలు పెట్టుకోనవసరం లేదని.. ఆయనతో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తబోవని సుబ్బారెడ్డి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.


Tags:    

Similar News