Tirumala: అంగరంగ వైభవంగా తిరుమల ముస్తాబు

Tirumala: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం

Update: 2022-01-13 00:39 GMT

అంగరంగ వైభవంగా తిరుమల ముస్తాబు

Tirumala: నేడు వైకుంఠ ఏకాదశి. ఈ సందర్భంగా తిరుమల అంగరంగ వైభంగా ముస్తాబైంది. తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శనాలు కూడా ప్రారంభమయ్యాయి. 12గంటల 5 నిమిషాలకు శ్రీవారి వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. ఆలయంలో అర్చకులు ధనుర్మాస పూజలు నిర్వహించారు. ధనుర్మాస పూజల అనంతరం ఒంటి గంట 45 నిమిషాల నుంచి స్వామివారి దర్శనం ప్రారంభమైంది. ప్రముఖుల దర్శనం పూర్తయిన తర్వాత సాధారణ భక్తులకు దర్శన అనుమతినిచ్చారు. 10 రోజులపాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించనున్నారు. ఇవాళ ఉదయం 9గంటలకు స్వామివారు స్వర్ణరథంపై దర్శనమివ్వనున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రముఖ ఆలయాల్లో ఉత్తర ద్వారం దర్శనం ద్వారా భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారు. కోవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ ఆలయాల్లో దర్శనాలు జరుగుతున్నాయి. కరోనా దృష్ట్యా పలు ఆలయాల్లో అధికారులు ఆంక్షలు విధించారు.

Tags:    

Similar News