Badvel By-Election: కడప జిల్లా బద్వేలులో ట్రయాంగిల్ వార్

*ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ *బద్వేలు ఉప ఎన్నికల బరిలో 15 మంది అభ్యర్థులు

Update: 2021-10-14 03:10 GMT

కడప జిల్లా బద్వేలులో ట్రయాంగిల్ వార్(ఫైల్ ఫోటో)

Badvel By-Election: కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికలకు పోటీ చేసే తుది జాబితా ఖరారైంది. ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం బుధవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో పోటీలో ఉన్నదెవరనే అంశంపై స్పష్టత వచ్చింది. బద్వేలు ఉప ఎన్నికల బరిలో 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో వైసిపి, కాంగ్రెస్, బిజేపిలు ప్రధాన పార్టీలు కాగా, ముగ్గురు స్వతంత్రులు, ఏడుగురు ప్రాంతీయ పార్టీల అభ్యర్ధులున్నారు. నామినేషన్ల ఉపసంహరణ తరువాత పోటీలో నిలిచిన 15 మంది అభ్యర్థులతో పాటుగా ఒక నోటా గుర్తు EVMలో కనిపించనుంది.

ప్రధాన ప్రతిపక్షాలైన టీడీపీ, జనసేనలు పోటీ నుంచి తప్పుకోవడంతో వార్ వన్‌ సైడ్ అవుతుందనుకున్న పరిస్థితి రివర్స్ అయింది. రెండు జాతీయ పార్టీలు ఉప ఎన్నిక బరిలో దిగడంతో పోటీ ట్రయాంగిల్ వార్‌గా మారింది. ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్లతో అధికార వైసీపీ ప్రచారంలో దూసుకుపోతోంది. బద్వేల్‌ ఉప ఎన్నికలో వైసీపీ నుంచి దివంగత ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ సుధ, కాంగ్రెస్ నుంచి కమలమ్మ, బీజేపీ నుంచి సురేష్‌లు పోటీ చేస్తున్నారు.

నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో ఇక అన్నీ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేయడంలో నిమగ్నమయ్యాయి. అధికార పార్టీ ఇప్పటికే నియోజకవర్గంలో తిష్ట వేశారు. దసరా పండుగ ఉన్నా వైసిపి ఇన్‌చార్జీలు మాత్రం స్థానికంగానే ఉంటూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇక బిజేపి కూడా ప్రచారంలో ముందుకెళ్తుంది. జిల్లాకు చెందిన మాజీ మంత్రి బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి తనకున్న పరిచయాలతో ఓటర్లను ప్రసన్నం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా 20 మంది స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించగా త్వరలోనే వీరంతా ప్రచారంలో పాల్గొంటారు. మొత్తం మీద నామినేషన్ల ఉపసంహరణ కూడా ముగియడంతో ఇక ప్రచారాన్ని హోరెత్తించనున్నాయి పార్టీలు. 

Tags:    

Similar News