Nellore: విషాదం.. బ్రెయిన్ స్ట్రాక్‌తో భర్త మృతి.. తల్లితో సహా ఎనిమిది నెలల గర్భిణి ఆత్మహత్య

Nellore: నెల్లూరు విక్రమనగర్‌లో విషాదం

Update: 2023-10-18 08:01 GMT

Nellore: విషాదం.. బ్రెయిన్ స్ట్రాక్‌తో భర్త మృతి.. తల్లితో సహా ఎనిమిది నెలల గర్భిణి ఆత్మహత్య

Nellore: నెల్లూరు నగరంలోని విక్రమ్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. భర్త బ్రెయిన్ స్ట్రోక్ మృతి చెందగా.. ఆ విషాదాన్ని తట్టుకోలేని ఎనిమిది నెలల గర్భిణి అయిన భార్య.. తల్లితో కలిసి బలవన్మరణానికి పాల్పడింది. నగరం లోని భగత్సింగ్ కాలనీకి చెందిన సుధాకర్ రెడ్డికి ఇది వరకే వివాహ మైంది. భార్య, పిల్లలు ఉన్నారు. బీవీ. నగర్ లో ఓ మార్ట్ షాప్ నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో నెల్లూరు గ్రామీణం మండలం అల్లీపురానికి చెందిన భానులత(33) తో పరి చయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది.

కొంత కాలం కిందట వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం భానులత ఎనిమిది నెలల గర్భిణి, తల్లి లక్ష్మితో కలిసి నెల్లూరు. అయ్యప్పగుడి వద్దనున్న విక్రమ్నగర్లో నివాసం ఉంటున్నారు. ఈ నెల 16న సుధా కర్రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. నిన్న మధ్యాహ్నం అంత్యక్రియలు జరిగాయి. భర్త మృతిని జీర్ణించుకుపోలేకపోయిన భాను ... ఆయన లేకుండా జీవించలేనని, తన తల్లితో కలిసి చనిపోతున్నానని సూసైడ్ లేఖ. రాసి ఇంట్లో ఫ్యాను చీరతో ఉరేసుకుని ఆత్మ హత్య చేసుకున్నారు. విషయం గుర్తించిన స్థానికులు వేదాయపాళెం పోలీసులకు సమా చారం అందించారు. ఇన్స్పెక్టర్ పీవీ నారా యణ సంఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News