విజయవాడ: కరోనా పై అవగాహన కల్పించేందుకు 3వ ట్రాఫిక్ సీఐ బాలరాజు ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది వాహనచోదకులకు మాస్కుల పై అవగాహన కల్పించారు.మాస్కుల యెక్క ఆవశ్యకత ను ప్రతి ఒక వాహనచోదకులకు తెలియజేయడానికి విజయవాడ సిటీ పోలీస్ లోగో కలిగిన ఫేస్ మాస్క్ ను ధరించి మాస్క్ ఎంత ఉపయోగకరమో వివరించారు. కరోనా ను ప్రాలదోలాలంటే మాస్క్ ను తప్పనిసరిగా ఉపయోగించాలని బయటకు వచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మాస్క్ తీయకూడదని తగు సూచనలు జారీచేశారు.
మాస్కుల వలన ఒక కరోనే కాకుండా కాలుష్యం నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చని విశదీకరించారు.అలాగే అందరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్కులను దరిస్తూ...చేతులను ఎప్పటికప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోగలగితే కరోనాను నియంత్రించవచ్చని తెలిపారు.ఇవేమీ పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తే మీ కుటుంబాలతో పాటు సమాజానికి కూడా హాని చేస్తారని అలా జరగకుండా భావితరాల కోసం అందరూ కృషిచేయాలని పేర్కొన్నారు.