Annamayya District: టమాటలు దొంగతనం చేసేందుకు.. రైతు హత్య
Annamayya District: పొలంలో నిద్రిస్తున్న రైతును చంపిన దుండగులు
Annamayya District: టమాటలు దొంగతనం చేసేందుకు.. రైతు హత్య
Annamayya District: అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలంలో రైతు దారుణ హత్యకు గురయ్యాడు. నవాబుకోటకు చెందిన మధుకర్ రెడ్డి అనే రైతును గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి హత్య చేశారు. పొలంలో టెంటు వేసుకొని నిద్రిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. టమాటలు దొంగతనం చేసేందుకు వచ్చి.. రైతు మధుకర్ రెడ్డిని హత్య చేసినట్లు తెలుస్తోంది. ఉదయం పొలాలకు వెళ్తున్న రైతులు మధుకర్ రెడ్డి చనిపోయినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.