Tirumala TTD Updates: తిరుమల భక్తులకు అలెర్ట్.. ఫిబ్రవరిలో శ్రీవారి విశేష ఉత్సవాలు.. ఏప్రిల్ దర్శన టికెట్ల విడుదల షెడ్యూల్ ఇదే!
Tirumala TTD Updates: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్! ఫిబ్రవరి నెలలో జరిగే రామకృష్ణ తీర్థ ముక్కోటి, తెప్పోత్సవాలు వంటి విశేష పర్వదినాల జాబితాను టీటీడీ విడుదల చేసింది. అలాగే ఏప్రిల్ నెల ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల ఆన్‌లైన్ కోటా విడుదల తేదీల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
Tirumala TTD Updates: తిరుమల భక్తులకు అలెర్ట్.. ఫిబ్రవరిలో శ్రీవారి విశేష ఉత్సవాలు.. ఏప్రిల్ దర్శన టికెట్ల విడుదల షెడ్యూల్ ఇదే!
Tirumala TTD Updates: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే భక్తుల కోసం టీటీడీ (TTD) కీలక అప్‌డేట్స్ ఇచ్చింది. ఫిబ్రవరి నెలలో తిరుమలలో నిర్వహించబోయే విశేష పర్వదినాల జాబితాను విడుదల చేయడంతో పాటు, ఏప్రిల్ నెల కోటాకు సంబంధించిన దర్శన టికెట్ల తేదీలను ఖరారు చేసింది.
ఫిబ్రవరి 2026: విశేష పర్వదినాల జాబితా
వచ్చే నెలలో తిరుమలలో పలు ముఖ్యమైన ఉత్సవాలు జరగనున్నాయి:
♦ ఫిబ్రవరి 1: శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి మరియు మాఘ పౌర్ణమి సందర్భంగా శ్రీవారి గరుడ సేవ.
♦ ఫిబ్రవరి 3: తిరుమొళి శైయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
♦ ఫిబ్రవరి 6: కూరత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
♦ ఫిబ్రవరి 26: అత్యంత వైభవంగా జరిగే శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభం.
♦ ఫిబ్రవరి 28: కుళశేఖరాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
ఏప్రిల్ కోటా దర్శన టికెట్ల విడుదల షెడ్యూల్:
ఏప్రిల్ నెలలో స్వామివారిని దర్శించుకోవాలనుకునే భక్తులు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవడానికి టీటీడీ ఈ క్రింది తేదీలను ప్రకటించింది:
♦ ఆర్జిత సేవలు (లక్కీ డిప్): నేడు (జనవరి 21) ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన వారు జనవరి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నగదు చెల్లించాల్సి ఉంటుంది.
♦ ఆర్జిత సేవలు (జనరల్ కోటా): కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ మరియు వసంతోత్సవ టికెట్లు జనవరి 22న ఉదయం 10 గంటలకు విడుదలవుతాయి.
♦ వర్చువల్ సేవలు: వర్చువల్ సేవలు మరియు వాటి దర్శన స్లాట్లు జనవరి 22న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయి.
♦ అంగ ప్రదక్షిణ టోకెన్లు: జనవరి 23న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.