Tirumala Alert: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. జనవరి 25న రథసప్తమి! మూడు రోజుల పాటు ఆ టోకెన్ల జారీ రద్దు!
తిరుమల రథసప్తమి 2026 వేడుకల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయాలు. జనవరి 24-26 వరకు SSD టోకెన్లు రద్దు. వాహన సేవల వివరాలు ఇక్కడ చూడండి.
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ (TTD) కీలక అలర్ట్ జారీ చేసింది. జనవరి 25న తిరుమలలో అత్యంత వైభవంగా జరగనున్న 'రథసప్తమి' వేడుకల నేపథ్యంలో దర్శనం, టోకెన్ల జారీలో పలు మార్పులు చేసింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొన్ని సేవలపై తాత్కాలికంగా నిషేధం విధించింది.
SSD టోకెన్ల జారీ రద్దు
రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున, తిరుపతిలో ఇచ్చే స్లాటెడ్ సర్వదర్శనం (SSD) టోకెన్ల జారీని జనవరి 24 నుంచి 26 వరకు రద్దు చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
ఒక్క రోజే ఏడు వాహన సేవలు.. షెడ్యూల్ ఇదే!
జనవరి 25న స్వామివారు ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. దీనినే 'అర్థ బ్రహ్మోత్సవం' అని కూడా పిలుస్తారు. వాహన సేవల వివరాలు:
రద్దయిన సేవలు.. వీఐపీ దర్శనాలు
రద్దీ నిర్వహణ కోసం టీటీడీ పలు దర్శనాలను మరియు ఆర్జిత సేవలను రద్దు చేసింది:
ఆర్జిత సేవలు: కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు.
ప్రివిలేజ్ దర్శనాలు: ఎన్‌ఆర్ఐలు, చంటిబిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు ఇచ్చే ప్రత్యేక దర్శనాలు రద్దు.
వీఐపీ బ్రేక్: ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా మిగిలిన వారికి వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉండవు. జనవరి 24న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.
పక్కా ఏర్పాట్లు:
భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, వైద్యం మరియు భద్రతా పరంగా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు అదనపు ఈవో తెలిపారు. ఘాట్ రోడ్లలో వాహనాల రాకపోకలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసినట్లు వివరించారు.