Guntur: సహకార సంఘాలకు సకాలంలో ఆడిట్‌ జరపాలి

సహకార సంఘాలకు ప్రతి ఏటా సకాలంలో ఆడిట్‌ నిర్వహించాలని ఆప్కాబ్‌ ఎండీ శ్రీధర్‌రెడ్డి ఆదేశించారు.

Update: 2020-03-05 06:32 GMT

గుంటూరు: సహకార సంఘాలకు ప్రతి ఏటా సకాలంలో ఆడిట్‌ నిర్వహించాలని ఆప్కాబ్‌ ఎండీ శ్రీధర్‌రెడ్డి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్‌) కంప్యూటరీకరణ పూర్తి కావాలన్నారు. దీర్ఘకాలంగా కంప్యూటరీకరణ అజెండాకే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులోని డీసీసీబీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్‌ సహకార భవన్‌లో బుధవా రం బ్రాంచ్‌ మేనేజర్లు, అధికారులతో ఆయన సమీక్షించారు. సమావేశానికి డీసీసీబీ చైర్మన్‌ రాతంశెట్టి సీతారామాంజనేయులు అధ్యక్షత వహించారు.

సొసైటీలను బలోపేతం చేయాలని, రుణాల రికవరీ పెంచాలని, పేద వర్గాలకు సహకార సంఘాలు అందుబాటులో ఉండేలా చూడాలని శ్రీధర్‌రెడ్డి సూచిం చారు. సహకారశాఖ రాష్ట్ర కమిషనర్‌ డాక్టర్‌ వాణిమోహన్‌ మాట్లాడుతూ కౌలు రైతులకు సొసైటీలలో రుణాలు ఇప్పించాలన్నారు. ఆప్కాబ్‌ జీఎంలు భానుప్రసాద్‌, రాజేశ్వరీలు మాట్లాడుతూ సహకారసంఘాల్లో బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌ విధానాన్ని తొలగించాలన్నారు.


Tags:    

Similar News