Visakhapatnam: విశాఖలో కూలిన మూడంతస్తుల భవనం
Visakhapatnam: గాయపడిన వారిని కింగ్ జార్జ్ ఆస్పత్రికి తరలింపు
Visakhapatnam: విశాఖలో కూలిన మూడంతస్తుల భవనం
Visakhapatnam: విశాఖలో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈఘటనలో ముగ్గురు మృత్యువాత పడగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. నిన్ననే పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న సాకేటి అంజలి అనే బాలిక మృత్యువాతపడింది. అంజలితోపాటు ఆమె సోదరుడు దుర్గాప్రసాద్, బీహార్‌కు చెందిన చోటు అనే ఇద్దరూ తీవ్రంగా గాయపడి శిథిలాలకింది చిక్కుకుపోయారు. మృత్యువుతో పోరాడిన ఆ ఇద్దరూ చనిపోయారు. శిధిలాలకింద బాలిక తండ్రి రాము, తల్లి కళ్యాణి ఇద్దరూ తీవ్ర గాయాలతో చిక్కుకుపోయారు.
భవనం కూలిపోయిన సమాచారం అందుకున్న అధికార యంత్రాంగం NDRF సిబ్బందిని రంగంలోకి దింపింది. అగ్నిమాపక దళ సిబ్బంది, NDRF కలిసి సహాయక చర్యలు చేపట్టారు. శిధిలాల కింద చిక్కుకున్న వారిని సమీపంలో ఉన్న కింగ్ జార్జి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని డిసిపి సుమిత్ గరుడ పరిశీలించారు.