Thota Chandrasekhar: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేసే కుట్రల్ని అడ్డుకుంటాం
Thota Chandrasekhar: కేంద్రాన్ని ప్రశ్నించే శక్తి జగన్‌కు లేదు
Thota Chandrasekhar: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేసే కుట్రల్ని అడ్డుకుంటాం
Thota Chandrasekhar: ఎన్నో ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరమ్ చేసే కుట్రల్ని భారత రాష్ట్ర సమితి అడ్డుకుంటుందని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్ర శేఖర్ పేర్కొన్నారు. విశాఖ నగరం సిరిపురం సర్కిల్ లోని ఉడా చిల్డ్రన్స్ థియేటర్‌లో భారత రాష్ట్రసమితి ఏపీ నేత గాదె బాలాజీ ఆధ్వర్యంలో విశాఖ సహా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన పలువురు తోట సమక్షంలో పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.
ఏపీలో పాలన సవ్యంగా సాగడంలేదని తోటచంద్ర శేఖర్ ధ్వజమెత్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై రాజకీయ పక్షాలు ఎలాంటి అడుగులు వేయలేని పరిస్థితుల్లో ఉన్నాయన్నారు. మూడు లక్షల కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్ ను ముప్పై ఐదు వేల కోట్లకు దొడ్డిదారిన ప్రైవేట్ సంస్తలకు కట్టబెట్టేలా కేంద్రం పావులు కదుపుతుందన్నారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరంకానవ్వకుండా కాపాడుకుంటామన్నారు.