Gajendra Singh Shekhawat: పోలవరంపై ముగిసిన కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ సమావేశం..
Gajendra Singh Shekhawat: ప్రాజెక్టు వేగంగా పూర్తి కావాలన్నదే సంకల్పం
Gajendra Singh Shekhawat: పోలవరంపై ముగిసిన కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ సమావేశం.. పనుల పురోగతి, సమస్యలపై సమీక్ష జరిపాం..
Gajendra Singh Shekhawat: పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై కేంద్రజలశక్తి మంత్రిత్వశాఖ ఆద్వర్యంలో జరిగిన సమావేశం ముగిసింది. ప్రాజెక్టు పనుల పురోగతి, సమస్యలపై సమీక్ష జరిపామని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తి కావాలన్నదే కేంద్రం సంకల్పమన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు అడ్ హక్‌గా 17వేల 414 కోట్లు విడుదల చేయాలని కోరినట్లు ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి తెలిపారు. నిధుల విడుదలకు కేంద్రం సానుకూలంగా స్పందించిందన్నారు. 2024 జూన్ కల్లా ప్రాజెక్టు పూర్తి చేయాలని కేంద్రం సూచించన్నట్లు వెల్లడించారు.