Kadapa: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు: ఎస్పీ

Update: 2020-03-06 08:24 GMT

కడప: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సందర్బంగా ఓటర్లకు డబ్బు, మద్యం లేదా ఇతరత్రా ప్రలోభాలకు గురిచేసేందుకు యత్నించే అభ్యర్థి గెలిచినా ఆ తర్వాత అది రుజువైతే వారు గెలిచినా ఆయా పదవుల్లో కొనసాగడానికి వీల్లేకుండా అనర్హత వేటుతో పాటు మూడేళ్ళ జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుందని జిల్లా ఎస్.పి అన్బురాజన్ హెచ్చరించారు.

ఈ మేరకు జిల్లా ఎస్.పి ఒక ప్రకటన విడుదల చేశారు. రాబోయే ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావాన్ని పూర్తిగా అరికట్టేందుకు ప్రభుత్వం కొత్తగా పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్సు రూపంలో ఉత్తర్వులు జారీచేసిందని ఎస్.పి తెలిపారు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఓటర్లను ప్రలోభపరచటం, ఎన్నికల ప్రక్రియలో ఓటర్లను పాల్గొనకుండా చేయడం వంటి నేరాలకు అభ్యర్థులు పాల్పడినట్లు తేలితే వారికి మూడేళ్ళ వరకు జైలు శిక్షతో పాటు వెయ్యి రూపాయల వరకు జరిమానా విధిస్తూ చట్టంలో మార్పులు చేశారని ఎస్.పి తెలిపారు.


Tags:    

Similar News