YV Subba Reddy: ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులకు గల కారణాలను సీఎం వివరిస్తారు
YV Subba Reddy: పార్టీ క్రియాశీల కార్యకర్తలతో సీఎం సమావేశమవుతారు
YV Subba Reddy: ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులకు గల కారణాలను సీఎం వివరిస్తారు
YV Subba Reddy: ఏపీలో రానున్న ఎన్నికల్లో 175 కు 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లను మారుస్తూ.. వై నాట్ 175 దిశగా దూసుకెళ్తోంది. ఈ నెల 25న భీమిలిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ఒక్కో నియోజకవర్గం నుంచి 5 నుంచి 6వేల మందిని తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తు్నారు. ఇదిలా ఉంటే.. ఉత్తరాంధ్ర నుంచి సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరిస్తారని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. భీమిలి సభ ద్వారా క్యాడర్‌కు సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. పార్టీ క్రియాశీల కార్యకర్తలతో సీఎం సమావేశమవుతారన్నారు. అలాగే.. పార్టీలో అసంతృప్తులు, ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులకు గల కారణాలను సీఎం వివరిస్తారన్నారు.