సీఎం జగన్ పై దాడికేసులో కీలక పరిణామం

CM Jagan: దాడికేసు విచారణపై స్టే ఇచ్చిన ఏపీ హైకోర్టు

Update: 2023-10-17 08:37 GMT

సీఎం జగన్ పై దాడికేసులో కీలక పరిణామం

CM Jagan: ఏపీ సీఎం జగన్ పై దాడి కేసులో జరుగుతున్న విచారణపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ కేసు విచారణను ఎనిమిది వారాల పాటు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ దాడి కేసు దర్యాప్తులో లోతైన విచారణ జరపాలని సీఎం జగన్ NIA కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. NIA కోర్టు ఆయన పిటిషన్ ను తోసిపుచ్చింది. దీంతో NIA ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు సీఎం జగన్. జగన్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. కౌంటర్ దాఖలు కోసం NIA తరపు న్యాయవాది సమయం కోరడంతో విచారణను వాయిదా వేసింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.

Tags:    

Similar News