మలికిపురంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటం గీసిన సంగీత్
Konaseema District: మామిడికుదురు మండలం ఈదరాడలో సర్వేపల్లి చిత్రరూపాన్ని ప్రదర్శించిన విద్యార్థులు
మలికిపురంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటం గీసిన సంగీత్
Konaseema District: గురుపూజోత్సవం పురస్కరించుకుని అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో ప్రముఖ చిత్రకారుడు ఎన్ సంగీత్ గీసిన చిత్రపటం అందరినీ ఆకట్టుకుంటోంది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నేటి తరానికి ఆదర్శమని...విద్యార్థులు పుష్పగుచ్చం, బహుమతులు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటున్నట్లు చిత్రపటం వేశారు. ఈ చిత్రాన్ని సునయన ఆర్ట్స్ అకాడమీ, ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ప్రదర్శించినట్లు చిత్రకారుడు సంగీత్ తెలిపారు. అలాగే మామిడికుదురు మండలం ఈదరాడ జడ్పీహెచ్ఎస్ విద్యార్ధులు వినూత్న వేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రం కూడా అందరినీ ఆకర్షిస్తుంది. గురుపూజోత్సవం పురస్కరించుకుని రాధాకృష్ణన్ చిత్రాన్ని విద్యార్థులు పూలతో మనోహరంగా రూపొందించారు. బంతి, గులాబీ పూలతో చక్కగా తీర్చిదిద్ది శ్రీ గురువే నమః అంటూ వందనాలు చేశారు.