'ఛలో ఆత్మకూరు'కు బాధితులు ఎవరెవరంటే..

Update: 2019-09-11 01:51 GMT

పల్నాడులో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల ప్రకటనలతో రాజకీయం మరింత వేడెక్కింది. ఛలో ఆత్మకూరు పేరుతో టీడీపీ పిలుపునివ్వగా పోటీగా వైసీపీ శ్రేణులు కూడా ఛలో ఆత్మకూరుకు సిద్ధమయ్యాయి. దీంతో పల్నాడులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాత్రినుంచే నేతల ఇళ్ల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. వారిని బయటికి రాకుండా అడ్డుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఆత్మకూరు చేరుకుంటున్న వైసీపీ, టీడీపీ కార్యకర్తల వాహనాలను కూడా ఎక్కడిక్కడ అడ్డుకుని వెనక్కు పంపుతున్నారు.

ఓ వైపు 144 సెక్షన్‌, మరోవైపు ముందస్తు అరెస్టులు చేస్తుండటంతో పల్నాడులో ప్రస్తుతం టెన్షన్‌ వాతావరణం నెలకొంది. వైసీపీ బాధితులతో టీడీపీ నేతలు యరపతినేని శ్రీనివాసరావు, పత్తిపాటి పుల్లారావులు చలో ఆత్మకూరుకు సిద్దమవగా.. నరసరావుపేట, సత్తెనపల్లిలోని మాజీ స్పీకర్ కోడెల బాధితులతో వైసీపీ నేత అంబటి రాంబాబు, గురజాలలో యరపతినేని బాధితులతో కాసు మహేష్ రెడ్డి, చిలకలూరిపేట టీడీపీ బాధితులతో విడదల రజిని చలో ఆత్మకూరుకు పయనమయ్యారు. అయితే నేతలెవ్వరూ బయటికి రాకుండా పోలీసులు వారిని గృహనిర్బంధం చేశారు.

Tags:    

Similar News