TDP: ఏపీలో 'రా కదలి రా' పేరిట టీడీపీ కార్యక్రమాలు
TDP: జగన్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా కార్యక్రమాలు
TDP: ఏపీలో 'రా కదలి రా' పేరిట టీడీపీ కార్యక్రమాలు
TDP: రా కదలి రా పేరిట ఏపీలో టీడీపీ కార్యక్రమాలు చేపట్టనుంది. వైసీపీ ప్రభుత్వం వైఫ్యలాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతామని ప్రకటించింది. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 5 నుంచి 29 వరకు నిర్వహించనున్న వరుస సభల్లో పాల్గొననున్నారు. ప్రతి రోజు రెండు పార్లమెంట్ పరిధిలోని బహిరంగ సభల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ నెల 5న కనిగిరి, 6న తిరువూరు, ఆచంట, 9న వెంకటగిరి, ఆళ్లగడ్డ, 10న బొబ్బిలి, తుని.. 18న గుడివాడ.. 19న గంగాధర నెల్లూరు, కమలాపురం.. 20 అరకు, మండపేట.. 24న పీలేరు, ఉరవకొండ.. 25న కోవూరు,పత్తికొండ.. 27 గోపాలపురం, పొన్నూరు.. 28న మాడుగుల, టెక్కలి.. 29న ఉంగుటూరు, చీరాలలో జరిగే బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొననున్నారు.