ఆన్‌లైన్‌లో 'మహానాడు'..టీడీపీ ప్రణాళికలు

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఈ ఏడాది మహానాడు నిర్వహించే విషయమై టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2020-05-22 13:45 GMT
mahanadu file photo

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఈ ఏడాది మహానాడు నిర్వహించే విషయమై టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి మహానాడును ఆన్‌లైన్‌లో నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది.ఈ మేరకు శుక్రవారం ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ ముఖ్య నేతలు సమావేశం అయ్యారు. జూమ్‌ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నిర్వహించననుంది.

మహానాడు నిర్వహణ, తీర్మానాలపై భేటీలో చర్చించారు. భౌతిక దూరం పాటిస్తూ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. టీడీపీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా మహేశ్వరరావు, నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజా, అశోక్ బాబు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో 6 గంటల్లో ఈ కార్యక్రమం పూర్తి చేసేలా ప్రణాళికలు రచించారు. ఈ కార్యక్రమంలో ఆన్ లైన్ ద్వారా 14 వేల మంది పాల్గొనేలా పార్టీ నేతలు ప్రణాళికలు రూపొందించారు. 

Tags:    

Similar News