మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై టీడీపీ ఎంపీ తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్ర విమర్శలు చేశారు.

Update: 2020-05-18 09:42 GMT
TDP MP kesineni nani(file photo)

ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి అధికారం అడ్డుపెట్టుకొని, వ్యాపారస్తులను బెదిరించి మరీ దండుకుంటున్నారని ఆరోపించారు. దుర్గగుడి మొత్తం దోచేస్తున్నారని, వినాయకుడి గుడి స్వాహా చేస్తున్నారని ట్వీట్ చేశారు.

'నీ దెబ్బకి విజయవాడ వణికిపొతుంది మంత్రి గారు'అంటూ ట్వీట్ చేశారు. మంత్రితో పాటూ సీఎం జగన్, సీఎంవో, వైసీపీని ట్యాగ్ చేశారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వైసీపీ నేతలు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో దుర్గ గుడి ఉద్యోగుల కార్యాలయం ప్రాంగణంలో సమావేశం నిర్వహించారట. గుడిలో తయారు చేసే పలు ప్యాకెట్లను అధికార పార్టీ అభ్యర్థులు డివిజన్లలో పంచారనే ఆరోపణలు వచ్చాయి.  




 


Tags:    

Similar News