టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి వైసీపీలో చేరతారా!

Update: 2019-09-04 03:52 GMT

టీడీపీలో ప్రస్తుతం వలసల రాజకీయం నడుస్తోంది. ఇప్పటికే కీలక నాయకులు, ఎంపీలు పార్టీని వీడారు. అయితే త్వరలో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారతారంటూ జరుగుతున్న ప్రచారం ఆ పార్టీని కలవరపెడుతోంది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వైసీపీలో చేరతారంటూ గతకొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆయన ఇప్పటికే వైసీపీ కీలకనేతలు వైవీ సుబ్బారెడ్డి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు లతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. వైసీపీలో చేరేందకు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికైనా సిద్ధమని గొట్టిపాటి అంటున్నారట. అలాగే నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ ఇంఛార్జిగా ఉన్న బాచిన చెంచు గరటయ్యతో కూడా మాట్లాడుకుంటానని చెబుతున్నారట.

అయితే ఈ ప్రచారంలో వాస్తవం ఎంత ఉందొ ఏమో గాని.. దీనిపై వివరణ మాత్రం గొట్టిపాటి వర్గం ఇవ్వలేదు. ప్రస్తుతం గొట్టిపాటి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. ఈ ప్రచారాన్ని ఖండించారు ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్.. తనకు తెలిసినంతవరకు గొట్టిపాటి టీడీపీలోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. ఇదిలావుంటే త్వరలో వైసీపీలోకి ఆసక్తికర చేరికలు ఉంటాయని ఆ పార్టీ రాజ్యసభ్య సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పిన తరువాత టీడీపీ మరింత అప్రమత్తమైంది. అసంతృప్తి నేతల్ని బుజ్జగించాలని పార్టీ హైకమాండ్ సీనియర్ నాయకులను ఆదేశించినట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News