ఖమ్మంలో మంత్రి అంబటి రాంబాబుకు నిరసన సెగ
Ambati Rambabu: మంత్రి బస చేసిన హోటల్‌ను ముట్టడించిన టీడీపీ శ్రేణులు
ఖమ్మంలో మంత్రి అంబటి రాంబాబుకు నిరసన సెగ
Ambati Rambabu: ఖమ్మంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు నిరసన సెగ తగిలింది. ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు ఖమ్మం వచ్చిన ఆయన ఓ హోటల్‌లో బస చేశారు. అక్కడికి చేరుకున్న టీడీపీ శ్రేణులు మంత్రికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఆయన వెళ్తున్న కాన్వాయ్‌కు అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. అంబటికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు టీడీపీ శ్రేణులను అరెస్ట్ చేసి.. మంత్రి కాన్వాయ్‌కు రూట్ క్లియర్ చేశారు.