కోడెల ఆత్మహత్య.. కార్యకర్తతో వర్ల రామయ్య ఫోన్ సంభాషణ వైరల్..

Update: 2019-09-18 03:12 GMT

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై పలు రకాల పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన చనిపోవడానికి కారణమైన పరిణామాలు, తదితర అంశాలపై టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. అయితే టీడీపీ నేత వర్ల రామయ్య, అనంతపురం టీడీపీ కార్యకర్త తో ఫోన్ లో సంభాషిస్తూ.. కొడుకు, కూతురు వల్లే కోడెల శివప్రసాదరావు ఉరేసుకున్నాడు అని అన్న రామయ్య వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. మరోవైపు వర్ల రామయ్యపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఒకవైపు కూతురు, కొడుకు వల్లే చనిపోయారని కార్యకర్తలతో చెబుతూ.. తమ పార్టీపై రామయ్య నిందలు వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇదిలావుంటే కోడెల శివప్రసాద్ రావు మృతి కేసుపై సిబిఐతో విచారణ జరిపించాలని చంద్రబాబు కోరుతున్నారు. వైసీపీ మాత్రం సిబిఐ విచారణకు అభ్యంతరం ఏమి లేదని చెబుతోంది. 

Tags:    

Similar News