Vangaveeti Radha: టీడీపీ నేత వంగవీటి రాధాకు స్వల్ప గుండెపోటు
Vangaveeti Radha: టీడీపీ నేత వంగవీటి రాధా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తెల్లవారుజామున ఛాతీలో నొప్పి ఉందని చెప్పడంతో... వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.
Vangaveeti Radha
Vangaveeti Radha: టీడీపీ నేత వంగవీటి రాధా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తెల్లవారుజామున ఛాతీలో నొప్పి ఉందని చెప్పడంతో... వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వంగవీటి రాధా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. అయితే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవరసం లేదంటున్నారు వైద్యులు. 48 గంటల పాటు ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని తెలిపారు.
మరోవైపు రాధా గుండెపోటుకు గురయ్యారనే వార్తతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. పలువురు ఆయన ఇంటి వద్దకు వెళ్లి వివరాలను కనుక్కుంటున్నారు. రాజకీయ నాయకులు కూడా రాధా ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. రాధా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.