Prathipati Pulla Rao: ఏపీలో అరాచక పాలన నడుస్తోంది..
Prathipati Pulla Rao: ఏపీలో అరాచక పాలన రాజ్యమేలుతోందన్నారు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.
Prathipati Pulla Rao: ఏపీలో అరాచక పాలన నడుస్తోంది..
Prathipati Pulla Rao: ఏపీలో అరాచక పాలన రాజ్యమేలుతోందన్నారు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. చంద్రబాబు పర్యటనలో కరెంట్ కట్ చేసి రాళ్లదాడి చేసిన ఘటనపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజాస్వామ్య బద్దంగా ర్యాలీలు, సభలు, పరామర్శలకు వెళితే దాడులు చేయడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. మొన్న అయ్యన్నను అక్రమంగా అరెస్ట్, నిన్న చంద్రబాబుపై దాడి, నేడు పవన్ కల్యాణ్ ను పర్యటనను అడ్డుకోవడం జగన్ అరాచక పాలనకు నిదర్శనం అన్నారు. ఇక చంద్రబాబును విమర్శించేస్థాయి మంత్రి విడుదల రజనికి లేదని చురకలంటించారు ప్రత్తిపాటి. మోటర్లకి మీటర్లు బిగించే విషయంలో వేల కోట్ల అవినీతి జరిగిందన్న ఆయన అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదన్న విషయాన్ని జగన్ తెలుసుకుంటే మంచిదన్నారు.