రాత్రంతా రోడ్డుపై పడుకొని నిమ్మల రామానాయుడు నిరసన

ఆంద్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ నేతల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. స్థానిక ఎన్నికలు, ఓ పక్క ఐటీ రైడ్స్, మరోపక్క స్కాంలతో ఏపీ వ్యాప్తంగా టీడీపీ వలసబాట పడుతోంది.

Update: 2020-03-11 10:27 GMT
Nimmala Ramanaidu (File Photo)

ఆంద్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ నేతల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. స్థానిక ఎన్నికలు, ఓ పక్క ఐటీ రైడ్స్, మరోపక్క స్కాంలతో ఏపీ వ్యాప్తంగా టీడీపీ వలసబాట పడుతోంది. తాజాగా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆర్ధరాత్రి నుంచి రోడ్డు మీద నిరసన చేపట్టారు. పేదలకు ఉచితంగా అన్నదానం చేస్తున్న షెడ్డును తొలగించడాన్ని నిరసిస్తూ ఆయన ఆందోళనకు దిగారు.

అయితే ఆయన ఆ తొలగించిన షెడ్ వద్దే రాత్రి పడుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ లు మూసేసింది. అయినప్పటికీ.. రామానాయుడు మాత్రం ప్రతిరోజూ ఒక పూట పేదలకు ఉచితంగా అన్నం పెడుతూ వస్తున్నారు. అన్నా క్యాంటీన్ ల వద్దే షెడ్డులో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. కాగా... రాత్రి కొందరు వ్యక్తులు షెడ్డును తొలగించారు.

విషయం తెలుసుకున్న రామానాయుడు అక్కడికి చేరుకున్నారు. మున్సిపల్ కమిషనర్ కు ఫోన్ చేసి ఎవరు తొలగించారంటూ ఆరా తీశారు. అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో అక్కడే రోడ్డు మీద పడుకొని రామానాయుడు తన నిరసన వ్యక్తం జేయడంతో ఆ ప్రాంతంలో సర్వత్రా అలజడి వ్యక్తమౌతుంది.



Tags:    

Similar News