ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన సంచలన ప్రకటనపై టీడీపీ ఎంపీ కనకమేడల విమర్శలు గుప్పించారు. జీఎన్ రావు కమిటీకి ఎలాంటి చట్టబద్ధతా లేదని అన్నారు. అసలు ఆ కమిటీ అమరావతి రాజధాని మార్పు కోసం వేసిన కమిటీయే కాదని అన్నారు. కావాలంటే తమపై ఎన్ని కేసులైనా పెట్టుకోవాలని, అంతేగానీ, అమరావతి రాజధానిని మాత్రం మార్చకూడదని కనకమేడల డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటనలో చాలా దురుద్దేశాలు ఉన్నాయని తెలిపారు. ఆయన చేసిన ప్రకటనపై రైతులు ధర్నాలకు దిగితే వారిని పెయిడ్ ఆర్టిస్టులని ఎలా అంటారని కనకమేడల ప్రశ్నించారు. రాజధాని రైతుల జీవితాలతో ఆడుకోవద్దని ఆయన అన్నారు.