టీడీపీకి బిగ్ షాక్ .. పార్టీని వీడిన మరో నేత!

ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా పడిన ఆనందంలో ఉన్న టీడీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

Update: 2020-03-16 16:54 GMT
Gade venkat reddy joins in YSRCP

ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా పడిన ఆనందంలో ఉన్న టీడీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అంతేకాకుండా ఆయన కుమారుడు మధుసూదన్ రెడ్డి కూడా పార్టీలో చేరారు. పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. ప్రకాశం జిల్లా పరుచూరు నుంచి గాదె వెంకటరెడ్డి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004, 2009లో బాపట్ల నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

గాదె వెంకటరెడ్డి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య హయంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఇక ఆ తర్వాత 2014లో రాష్ట్ర విభజన అనంతరం ఆయన టీడీపీలో చేరారు. ఇప్పుడు టీడీపీని వీడిన గాదె వెంకటరెడ్డి వైసీపీలో చేరి టీడీపీకి బిగ్ షాక్ ఇచ్చారు. ఇక వైసీపీలో చేరిన అనంతరం అయన మాట్లాడుతూ.. స్వచ్ఛందంగా వైఎస్సార్‌సీపీలో చేరానని, జీవితాంతం వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతానని వెల్లడించారు. ఇక 6 నెలల్లోనే ఇచ్చిన హామీలన్ని పూర్తి చేసిన వ్యక్తి సీఎం వైఎస్‌ జగన్‌ మాత్రమేనని అన్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఇప్పటికే టీడీపీని పలువురు నేతలు వీడిన సంగతి తెలిసిందే.. 

Tags:    

Similar News