జగన్ సర్కారుకు టీడీపీ ఎమ్మెల్సీ మద్దతు
ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణ జలాల వివాదం రోజురోజుకు ముదురుతుంది.
ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణ జలాల వివాదం రోజురోజుకు ముదురుతుంది.శ్రీశైలం జలాశయం ఎగువన పోతిరెడ్డిపాడుకు ఎత్తిపోతల పథకం ద్వారా రాయలసీమకు నీరు ఇవ్వడానికి జగన్ సర్కార్ తెచ్చిన జీవో 203పై యుద్ధం నడుస్తోంది. తమ నిర్ణయం సరైనదేనని పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తీసుకెళ్లడం తమ హక్కు అని జగన్ సర్కార్ వాదిస్తోంది.
అయితే తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం ఈ జీవోను తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అగ్రనేతలు మౌనంగా ఉన్నారు. దీనిపై టీడీపీ నుంచి రాయలసీమ నేత సీఎం వైఎస్ జగన్ ప్రత్యర్థి, పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ బీటెక్ రవి స్పందించారు. పోతిరెడ్డిపాడుకు సంబంధించిన జీవో విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని పూర్తిగా సమర్థిస్తున్నట్లు ప్రకటించారూ.
జీవో 203ని సమర్థిస్తున్నామని, రాయలసీమ ప్రజల కోసం ఎవరు పోరాడినా అండగా ఉంటామని బీటెక్ రవి వెల్లడించారు. సీఎం జగన్ ముందు చూపులేకుండా వ్యవహరిస్తున్నారని బీటెక్ రవి వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌తో ఆర్థిక లావాదేవీల కోసం పోతిరెడ్డిపాడును నిర్వీర్యం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.